
తహసీల్దారుకు కోర్టు ధిక్కార నోటీసులు
రాయచోటి టౌన్ : సివిల్ కేసులో ప్రిన్సిపల్ జూనియర్ సివి ల్ జడ్జి ఆదేశాల ధిక్కరణపై రాయచోటి తహశీల్దారు, మున్సి పల్ కమిషనర్, టౌన్ ఫ్లానింగ్ ఆఫీసర్లకు నోటీసులు జారీ చేసినట్లు భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కడప జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ టి.ఈశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. రాయచోటి పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన మల్లికార్జున స్థలం అదే వీధిలో ఉంటున్న బండి మురళి, బండి హారిణిలు దౌర్జన్యంగా ఆక్రమించుకొన్నారని జూనియర్ సివిల్ కోర్టులో కేసు దాఖాలు చేశారని తెలిపారు. సదరు వ్యక్తులు ఆ స్థలంలోకి వెళ్లరాదని 121/23 కేసు నమోదు చేశారన్నారు. పాముల మల్లిఖార్జున ఆ స్థలంలోకి వెళ్లరాదని తెలిసినప్పటికీ రాయచోటి తహసీల్దార్ తన కార్యాలయానికి పిలిచి మల్లిఖార్జునకు వ్యతిరేకంగా మాట్లాడటంతోపాటు వారికి వ్యతిరేకంగా వచ్చిన వారికి అనుకూలంగా మాట్లాడటం కోర్టు దేశాలను ధిక్కరించడమేనని చెప్పారు. దానిపై తహశీల్దార్‌తో పాటు మున్సిపల్ కమీషనర్, టౌన్ ఫ్లానింగ్ అధికారికి నోటీసులు పంపడంతో పాటు ప్రైవేట్ కేసు కూడా చేయనున్నట్లు న్యాయవాది టి.ఈశ్వర్ తెలిపారు.
మహిళ మెడలో గొలుసు చోరీ
రాజంపేట : మహిళకు మాయమాటలు చెబుతూ.. ఉన్నపాటుగా మెడలో గొలుసు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఉప్పరపల్లెలో ఉన్న ఓ మహిళ వద్దకు బైక్‌పై వచ్చిన ఇద్దరు ఈ అడ్రస్ ఎక్కడంటూ ఆరా తీశారు. ఆమెను మాటల్లోకి దించి అదును చూసి మెడలో నుంచి సరుడు అపహరించుకుపోయారు. పట్టపగలే జరిగిన ఈ సంఘటనతో స్ధానికులు ఆందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ మండల కమిటీల నియమాకం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోని పలు మండలాలకు మండల పార్టీ కమిటీలను నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కురబలకోట మండలం: ఉపాధ్యక్షులుగా డి.అశోక్‌కుమార్‌రెడ్డి, వి.ముస్తాక్, ప్ర ధాన కార్యదర్శులుగా ఎం.గోపీనాథ్‌రెడ్డి, వి.శంకర్‌రె డ్డి, కె.శివశంకర్, జి.రమేష్‌రెడ్డి, కార్యదర్శులుగా పి.రమణ, వేణుగోపాల్‌రెడ్డి, వై.నారాయణ, ఎస్.అంజద్, బి,తులసిరామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఇ.చలపతి, ఎన్.మంజునాథ్, బి.వేణుగోపాల్‌రెడ్డి, ఆర్.శ్రీనివాసులు, బి.రవీంద్ర, ఎస్.సురేంద్రారెడ్డి, మునాఫ్, జి.సోమశేఖర్‌రెడ్డి, జి.నాగేశ్వర్, మహబూబ్‌అలీ, ఎస్. బావాజీ, ఎం.శ్రీనివాసులు, కె.మహబూబ్‌పీర్, ఈరప్ప, బాబు, సి.రమణారెడ్డి, శివలను నియమించారు. పెద్దముడియం: ఉపాధ్యక్షులుగా సి.రెడ్డెప్పరెడ్డి, కె.జగన్‌మోహన్ ఆచా రి, ప్రధాన కార్యదర్శులుగా ఎం.సుబ్బారెడ్డి, బి.సాంబశివారెడ్డి, ఎం.భాస్కర్, ఎం.సుధాకర్, కార్యదర్శులుగా ఎం.మహేశ్వర్, బి.మోహన్‌రెడ్డి, కె.రామాంజులు, ఎ.రామచంద్ర, బి.అబ్దుల్ మునాఫ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా డి.వెంకట శివయ్య, పి.ఆలంఖాన్, ఎం.అబ్దుల్లా, టి.అంజి, ఎం.శివయ్య, ఎస్.గౌస్‌మోద్దీన్, బి.గోపాల్‌నాయక్, పి.శ్రీనివాసులు, వై.లక్ష్మిపతి నాయుడు, బి.రవీంద్రనాయక్, పి.రమణారెడ్డి, ఎం.భాస్కర్ నాయక్, సి.ప్రతాప్‌రెడ్డి, జి.రామకృష్ణారెడ్డి, బి.రవీంద్ర, కె.ఓబుల్‌రెడ్డిలను నియమించారు. తంబళ్లపల్లె: ఉపాధ్యక్షులుగా వెంకటరెడ్డి, మహేష్‌రెడ్డి, ప్రధాన కా ర్యదర్శులుగా జె.జగదీష్, వాసుదేవరెడ్డి, బి.రెడ్డెప్ప నా యక్, కార్యదర్శులుగా షఫీ, బావాజాన్, చలపతినా యుడు, రమణారెడ్డి, మల్లప్ప, మధురాయల్, ఎగ్జిక్యూ టివ్ మెంబర్లుగా రవి, శ్రీరాములు, శంకర్‌నాయక్, మురళీధర్, వి.ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, మహేష్, బి.రవీందర్‌నాయక్, డి.రమణారెడ్డి, ఎ.అంజన్‌కుమా ర్, ఆంజనేయులు, ఆర్.చిన్నప్ప, టి.మధు, బి.వెంకట రమణ, సి.శ్రీనివాసులును నియమించారు.