
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్దాలి
కడప రూరల్ : ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్దాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ కోరారు. ఆదివారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో చట్టం చేసేలోపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్ది మాల, మాదిగ వర్గాలకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణ ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి వర్గీకరణ అంశానికి సంబంధించి సమన్యాయం చేస్తున్నారని తెలిపారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య, ఏపీ ఎమ్మార్పీఎస్ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గొడుగునూరు మునెయ్య, తప్పెట హరిబాబు, మాతంగి సుబ్బరాయుడు, తప్పెట శివ, వెంకటసుబ్బయ్య, కొన్నెపల్లె మునెయ్య తదితరులు పాల్గొన్నారు.