
ఉత్సాహంగా క్యారమ్స్ పోటీలు
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో శనివారం క్యారమ్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బాలికల విభాగంలో ప్రశాంతి ప్రథమ, దేవిశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో అండర్ 11 పోటీలలో రెమంత్ ప్రథమ, అబ్దుల్‌ఖాదర్ ద్వితీయ స్థానంలో, అండర్ 14 విభాగంలో రంగనాథ్ ప్రథమ, ద్వారకనాథ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. పురుషుల విభాగంలో ఆబిద్ ప్రథమ, జశ్వంత్ ద్వితీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ శ్రీనివాసులు, హ్యాండబాల్ కోచ్ మునాఫ్, బాడ్మింటన్ కోచ్‌లు పాల్గొన్నారు.