
పట్టుపట్టి.. ర్యాంకులు కొట్టి
కడప ఎడ్యుకేషన్ : తల్లిదండ్రుల కష్టాలను చూసిన విద్యార్థులు తమ లక్ష్యం ఎంచుకున్నారు. కష్టపడి చదవి తమ కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీ ఈసెట్ పరీక్ష ఫలితాలు గురువారం వెలువడగా జిల్లా విద్యార్థులు ర్యాంకులు సాధించి భళా అనిపించారు. ఇంజినీరింగ్ చదివి తల్లిదండ్రుల కష్టం తీరుస్తామని చెబుతున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలని..
తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లెకు చెందిన సురేష్‌రెడ్డి కుమార్తె పల్లెటి రాజశ్రీ ఏపీ ఈసెట్‌లో ఐదో ర్యాంకు సాధించారు. ఈమె తండ్రి పులివెందుల మెడికల్ కళాశాలలో ఆరోగ్యమిత్రగా పనిచేస్తుండగా, తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా ఉంది. రాజశ్రీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పలివెందులలో చదివారు. పులివెందుల లయోలా కళాశాలలో పాలిటెక్నిక్ సీఎస్‌సీ పూర్తి చేశారు. ఈసెట్ రాసి ఐదో ర్యాంకు సాధించారు. మంరి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యమని విద్యార్థిని తెలిపారు.
రైతు కుమారుడు చదువులో మెరిసె..
ఖాజీపేట కొటంగురువారిపల్లెకు చెందిన మారుతి శ్రీనివాసులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన సతీమణి నాగలక్ష్మికళ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు తరుణ్ ఏపీ ఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన తరుణ్ కష్టపడి చదివాడు. తిరుపతి ఎస్వీ కాలేజీలో డీఫార్మసీ పూర్తి చేశారు. ఏపీ ఈసెట్‌లో ఆరో ర్యాంకు సాధించారు. కొలువు సాధించమే లక్ష్యం అని చెబుతున్నారు.
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించా..
తమ తల్లితండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన గణేష్ కష్టపడి చదివి ఏపీ ఈసెట్‌లో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. వేంపల్లి మండలం ముత్తకూరు గ్రామానికి చెందిన గంగరాజు, గంగాభవానీలు వ్యవసాయం చేస్తూ కుమారుడిని చదివించారు. గణేష్ పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్‌పూర్తి చేశాడు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని చదివి ఏపీ ఈసెట్ రాశారు. ఆరో ర్యాంకు సాధించి భళా అనిపించాడు. మంచి కొలువు సాధించి తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చాలన్నదే తన లక్ష్యమన్నారు.
బేల్థారి కుమారుడు ర్యాంకు సాధించాడు
జమ్మలమడుగు మండలం పెద్దగండ్లూరుకు చెందిన చెన్నారెడ్డి బేల్దారి పని చేస్తున్నారు. తల్లి శివపార్వతి గృహిణి. వీరి కుమారుడు గువ్వల జయచంద్రారెడ్డి రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్న జయచంద్రారెడ్డి వారి కష్టాలు గుర్తించాడు. కష్టపడి చదివి ఏసీ ఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో పదో ర్యాంకు సాధించాడు. కొలువు సాధించి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తానని చెప్పారు.
ఏపీ ఈసెట్‌లో విద్యార్థుల ప్రతిభ

పట్టుపట్టి.. ర్యాంకులు కొట్టి

పట్టుపట్టి.. ర్యాంకులు కొట్టి

పట్టుపట్టి.. ర్యాంకులు కొట్టి