
చెట్టును ఢీకొన్న లారీ
అట్లూరు : మండలంలోని కడప–బద్వేల్ రహదారిపై కలివికోడి పరిశోధనా కేంద్రం సమీపంలో ఓ లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. స్థానికుల వివరాల మేరకు.. గురువారం రాత్రి కడప వైపు నుంచి వెళ్తున్న లారీ అట్లూరు పోలీస్ స్టేషన్ సమీపం లోని కలివికోడి పరిశోధనా కేంద్రం వద్దకు చేరగానే.. అదుపు తప్పి రోడ్డుకు ఆవల ఉన్న వేప చెట్టును డీకొంది. రాత్రి సమయంలో వాహనాలు రాకపోవడంతో డ్రైవర్‌కు పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో లారీ నడిపినట్లు స్థానికులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
బద్వేలు అర్బన్ : నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు బద్వేల్ వాసులకు తీవ్రగాయాలయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని వల్లెరవారిపల్లెకు చెందిన సుధీర్, బ్రాహ్మణ వీధికి చెందిన మహేష్ పిపి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. శుక్రవారం ఓ పని నిమిత్తం తమ స్కూటీలో నెల్లూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా కదిరినాయుడుపల్లె సమీపంలోని వంతెన వద్ద అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు.
కోర్టు సముదాయంలో
భద్రతపై సెక్యూరిటీ ఆడిట్
కడప అర్బన్ : కడప నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలో భద్రతా చర్యలపై స్టేట్ ఇంటెలిజెన్స్, పోలీస్, అగ్నిమాపక అధికారులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. భవన సముదాయంలో ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సీసీ కెమేరాలు, ఫైర్ సేఫ్టీ, ఇతర చర్యల నిమిత్తం కోర్టు ఆవరణంతా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ వై.సాయిరాం, స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ సీఐ సుదర్శన్‌రెడ్డి, కడప డీఎస్పీ పి.వెంకటేశ్వర్లు, ఎస్.వినయ్‌కుమార్‌రెడ్డి, ఆర్.పురుషోత్తం రాజు, బసివిరెడ్డి, జీవన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

చెట్టును ఢీకొన్న లారీ