
లైంగిక వేధింపులపై కేసు నమోదు
కొండాపురం : మండలంలోని పొట్టిపాడు గ్రామానికి చెందిన సింగంశెట్టి సూర్యనారాయణ అలియాజ్ పెద్దసూరి లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. పొట్టిపాడు గ్రామానికి చెందిన సింగంశెట్టి సూర్యనారాయణ స్థానిక మహిళతో అసభ్యంగా మాట్లాడుతూ లైంగికంగా వేధిస్తున్నారు. ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పడంతో అతడు వెళ్లి సూర్యనారాయణను మందలించాడు. దీంతో అతడు, ఆయన బంధువు తాను, తన భర్తపై దాడికి యత్నించారని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చంటి హత్య కేసులో
నిందితుల అరెస్టు
చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం కోమటిపేటకు చెందిన కందుల చంటి హత్య కేసులో నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, చక్రాయపేట ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులైన రెడ్డివారిపల్లె మాలపల్లెకు చెందిన దాసరి వెంకటరమణకుమార్ అలియాస్ రమణకుమార్, జల్ది దర్శనమ్మ, రెడ్డివారిపల్లెకు చెందిన సురభి ఈశ్వరయ్యలను బాలతిమమయ్యగారిపల్లె క్రాస్ వద్ద అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు పంపినట్లు వారు తెలిపారు
ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీప్రసాద్
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా ఏపీజీఈఏ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం) అధ్యక్షుడిగా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి డాక్టర్ లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికకు కడప జిల్లా అధ్యక్షుడు రఘురాంనాయుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ ఎన్నికలు బుధవారం నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి అధికారకంగా శుక్రవారం వెలువడ్డాయి.