
సోలార్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ రామసుబ్బ
పెద్దముడియం మండలంలో ఓ ప్రైవేటు సోలార్ కంపెనీ పాల్పడుతున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాల ని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు చెప్పకుండానే వారి పట్టా భూముల్లో దౌర్జన్యంగా గుంతలు తవ్వి ఫిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇందుకు అభ్యంతరం చెప్పిన రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గత ఖరీఫ్, రబీలో పంటలు నష్టపోయిన రైతులందరికీ పెట్టుబడి సాయం ఇంతవరకు అందలేదన్నా రు. అన్నదాత సుఖీభవ కింద తక్షణమే సాయం అందించి ఆదుకోవాలన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తనాలు సకాలంలో సరఫరా చేయాలని కోరారు. తన స్వగ్రామమైన గుండ్లకుంటలోని జెడ్పీ హైస్కూలు పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. చెరువుల్లో కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చినట్లు గుంతలు తవ్వడం వల్లే ఈతకు వెళ్లిన పిల్లలు చనిపోతున్నారని వాపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువుల్లో 30 అడుగుల లోతు గుంతలు తవ్వేస్తున్నారని, వీటిని అరికట్టాలన్నారు.