
పనులు అడ్డుకుంటున్న ‘వరద’: వైస్ చైర్మన్ శారద
తన స్వగ్రామమైన రామాపురం గ్రామంలో తాగునీరు, స్మశానానికి అవసరమైన రహదారి ఏర్పాటుకు సంబంధించి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో తాను ప్రతిపాదించిన పనులకు అంచనాలు వేయనీయకుండా ఎమ్మె ల్యే వరదరాజులరెడ్డి అడ్డుకుంటున్నారని జెడ్పీ వైస్ చైర్మన్ జేష్ఠాది శారద ఆరోపించారు. రాజకీయ కక్షతో పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. ఒక దళిత మహిళ ప్రతిపాదించిన పనులను అడ్డుకోవడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. అధికారులు ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గకుండా అంచనాలు తయారు చేయించి సమర్పించాలని కోరారు.