
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
కడప అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజకు ప్రణాళిక ఖరారైంది. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఈ ఖరీప్ సీజన్‌కు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఇరిగేటెడ్, నాన్ ఇరిగేటెడ్‌కు కింద జిల్లాలో 1,28.084 హెక్లార్లలో వివిధ పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి రైతన్నలకు ఏ మేరకు విత్తనాలు అవసరమో ప్రణాళికలను పంపి విత్తనాలను తెప్పించి రైతులకు సబ్సిడీ కింద అందించనుంది. అలా సబ్సిడీతో ఇచ్చే విత్తనాల కేటాయింపులో ఈసారి కూటమి ప్రభుత్వం కోత పెట్టింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కేటాయింపుల్లో కోత..
జిల్లాలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా రైతులకు సబ్సిడీ కింద 12252 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు కేటాయించింది. అలాంటిది ఈ ఏడాది ఖరీఫ్‌కు వైఎస్సార్‌జిల్లా రైతులకు 11432 క్వింటాల్లు రాయితీ విత్తనాలు అవసరమవుతాయని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులోనూ కూటమి ఫ్రభుత్వం కోత వేసి విత్తనాలను కేటాయించింది. జూన్ నుంచి ప్రారంభంకానున్న ఖరీప్–2025కు సంబంధించి జిల్లాకు మెత్తంగా 11432 క్వింటాళ్ల విత్తనాలు అవసరంకాగా అందులో 8591.55 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది.
ఖరీఫ్‌కు కేటాయించిన ఎరువుల వివరాలు ఇలా..
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాకు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి నెలల వారీగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఖరీఫ్ సీజన్ మోత్తానికి 73,582 మెట్రిక్ టన్నుల ఎరువులను అవసరంగా వ్యవసాయ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలను సమర్పించారు. ఎరువులకు సంబంధించి ఖరీఫ్ సీజన్‌కుగాను 32000 మెట్రిక్ టన్నుల యూరియా, 10000 మెట్రిక్ టన్నుల డీఏపీ, 5000 మెట్రిక్ టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 5000 మెట్రిక్ టన్నుల సింగల్ సూపర్ పాస్పెట్, 40,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను అవసరంగా గుర్తించి నివేదికలను ప్రభుత్వానికి నివేదించారు.
ఖరీఫ్‌లో సాగయ్యే ప్రధాన పంటల వివరాలు ఇలా..
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రధాన పంటలైన వరి 30,804 హెక్టార్లలో, మిల్లేట్స్ 34,472, మినుము 3806, కంది 5761, మిరప 1679, పసుపు 2229, ఉల్లి 5203, టమాట 1329, వేరుశనగ 5976, పొద్దుతిరుగుడు 1142 హెక్టార్లలో సాగుకానున్నాయి.
జిల్లాకు విత్తనాలు, ఎరువులు
కేటాయింపు
3253 క్వింటాళ్లు వేరుశనగ క్కాయలు
1537 క్వింటాళ్లు జీలుగలు,
2982 క్వింటాళ్లు జనుములు
92000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా ప్రతిపాదనలు
ఈ ఏడాది ఖరీఫ్‌లో 1,28,084 హెక్టార్లో పంటల సాగు ఖరారు