
మద్యం అనర్థాలపై అవగాహన ముఖ్యం
కడప సెవెన్‌రోడ్స్ : మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధ్వర్యంలో కేర్ (కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్)పై ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆల్కహాల్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కేర్ కమిటీ ఏర్పాటైందన్నారు. ప్రతి మద్యపాన వినియోగదారునికి వాటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలను తెలియజేసే విధంగా మద్యం షాపుల్లో కరపత్రాలు అందజేయాలని అధికారులకు సూచించారు. మద్యపాన వినియోగంపై అవగాహన సదస్సులు, చర్చా గోష్టులు, మాబ్లు, ప్రదర్శనలు, మద్యపానం లేని జీవిత ప్రయోజనాలను తెలిపే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మైనర్లకు మద్యం విక్రయిస్తే మద్యం షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల కళాశాలలో ఆల్కహాల్ వ్యతిరేక అవగాహన తరగతులు నిర్వహించాలన్నారు.
ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలలో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మద్యపాన వినియోగం వల్ల కలిగే అనారోగ్య, సామాజిక, ఆర్థిక దుష్ప్రభావాలను వివరించాలని అన్నారు. మందు తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులపై గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలు, కేర్ కమిటీ సభ్యులు సూచించిన సలహాలు తీసుకొని మద్యపాన వినియోగంపై గట్టి చర్యలు చేపడతామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్. రవికుమార్, డీఈఓ షంషుద్దీన్, జిల్లా విద్యా ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, జిల్లా కో–ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ హిమాదేవి, సూపర్డెంట్ ఆఫ్ సైక్రియాటిస్ట్ డా.వెంకట రాముడు,జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జమున తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్