
ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కడప డిపో ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం ఆర్టీసీ అధికారుల తీరును నిరసిస్తూ ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప డిపో మేనేజర్, టీఐ3 ఇరువురు కడప డిపో ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కార్మికుల ఆమోదయోగ్యమైన కోర్కెలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కడప డిపో కార్యదర్శి శ్రీనివాసులు, రీజియన్ సంయుక్త కార్యదర్శి కేఎస్ దాస్, కోశాధికారి టీఎం బాషా, వైస్ ప్రెసిడెంట్ పీఎస్ ఖాన్, కేఎంఎస్ రావు, రామయ్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.