
ప్రొద్దుటూరు ఆస్పత్రిలో గుర్తు తెలియని మృతదేహాలు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఇరువురు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను భద్రపరిచారు. సుబ్బరాయుడు (60) అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా ఈ నెల 12న జిల్లా ఆస్పత్రిలోని ఎంఎం–2 వార్డులో చేరాడు. మంగళవారం మృతి చెందాడు. ఐపీ రిజిష్టర్‌లో అతని పేరు మినహా ఊరు పేరు, సెల్ నంబర్ లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అలాగే బ్రహ్మయ్య (70) అనే వ్యక్తి ఈ నెల 11న అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ 12న అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు. మృతుల బంధువులు తమను సంప్రదించాలని మార్చురీ ఇన్‌చార్జి వరాలు తెలిపారు.

ప్రొద్దుటూరు ఆస్పత్రిలో గుర్తు తెలియని మృతదేహాలు