
మరో నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ పలకరించనుంది. దాంతోపాటే
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చెల్లించిన రైతు భరోసా, పీఎం కిసాన్ నిధుల వివరాలు ఇలా..
సంవత్సరం రైతుల విడుదలైన సంఖ్య నిధులు
(కోట్లలో)
2019–20 206708 279.93
2020–21 208747 280.06
2021–22 199344 269.11
2022–23 202598 235.68
2023–24 210481 126.25
● అన్నదాత సుఖీభవ పథకానికి
మోక్షం లభించేనా?
● తల్లికి వందనం పథకం అందరికీ వర్తింపుపై అనేక అనుమానాలు
● సాగు సాయం కోసం
రైతుల ఎదురుచూపులు
● ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
కడప ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. నేటికీ పెన్షన్లు మినహా సూపర్ సిక్స్ హామీలు అమలుకాని పరిస్థితి నెలకొంది. అటు అన్నదాత సుఖీభవ సాయం అందక రైతులు.. తల్లికి వందనం రాక విద్యార్థుల తల్లులు ఆందోళన చెందుతున్నారు. పథకాలకు సంబంధించిన నిధుల విడుదల అదిగో ఇదిగో అంటూనే ఏడాదిపాటు కాలయాపన చేసింది కూటమి ప్రభుత్వం. మరి ఈ ఏడాదైనా పథకాలు సక్రమంగా అమలవుతాయా లేక మళ్లీ కాలయాపనేనా అని పలువురు లబ్ధిదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాలు వస్తాయనుకున్న ప్రజల ఆశలు అడియాసలే అయ్యాయి.
మరో 20 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. రైతన్నలు సాగుకు సన్నద్ధం కావాల్సిన సమయమిది. మరి ఈసారైన ప్రభుత్వం కరుణిస్తే రైతులకు పెట్టబడి ఖర్చులు కలిసొస్తాయి. లేకుంటే మళ్లీ అప్పులకు అడుగలేయక తప్పదని పలువురు రైతన్నలు అంటున్నారు. మరి ప్రభుత్వం కరుణిస్తుందా లేక కాలయాపనతో సరిపెడతుందా అని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు.
ఏడాది నుంచి అన్నదాతలకు తప్పని కష్టాలు...
గత ఏడాది నుంచి అన్నదాతలకు కష్టాలు తప్పలేదు. అటు అనావృష్టి, ఇటు అతివృష్టి కారణంగా ఈ ఏడాది రైతులు పూర్థిస్తాయిలో దెబ్బతిని పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు ఆందోళన చెందారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పథకాలను అమలు చేసినా లబ్థిదారులకు చేయూతగా ఉండేది. అటువైపు నుంచి సహకారం అందకపోడంతో అన్నదాతలు నిండామునగాల్సిన పరిస్థితి నెలకొంది. పైగా పండిన అరకొర పంట దిగుబడులకు కూడా గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంస్పందించి ఈ ఏడాదైనా పథకాలను అమలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గత ప్రభుత్వం ఆరంభంలోనే పెట్టుబడిసాయం..
రైతులు పంటలసాగు కోసం ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభంలోనే పెట్టుబడి సాయం(వైఎస్సార్ రైతు భరోసా) అందించి అన్నదాతలకు అండగా నిలిచింది. ఏటా క్రమం తప్పకుండా ఈ మొత్తన్ని అందించింది. పీఎం కిసాన్ సాయం కింద రూ. 6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 7500 మొత్తం కలిపి ఏడాదికి రూ. 13500 రైతు ఖాతాలకు జమ చేసేది. ఇలా వైఎస్సార్ రైతుభరోసా, పీఎం కిసాన్ కింద ఐదేళ్లపాటు రూ. 1191.03 కోట్లను అన్నదాతలకు అందించి అండగా నిలిచింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రాష్ట్రవాట కింద రూ. 14 వేలు అందిస్తామని ప్రకటించింది. కానీ ఏడాది ముగిసినా ఆమాటే లేదు. పైసా విదిల్చలేదు.
అమ్మ ఒడి పథకంతో..
గత ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. నాలుగేళ్లలో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుగానే క్యాలెండర్‌ను ప్రకటించి తల్లుల ఖాతాలకు నగదును జమచేసింది. జిల్లావ్యాప్తంగా అన్ని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 1,80,203 మంది తల్లులకు నగదు అందించింది. గతంలో కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేసింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అందరికి అమ్మ ఒడి అన్ని చెప్పారు. మరి ఇది అమలు జరుగుతుందా లేక ఎదురు చూపులేనా అన్ని పలువురు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద చెల్లించిన నిధులు వివరాలు...
సంవత్సరం తల్లుల జమచేసిన
సంఖ్య మొత్తం
కోట్లలో
2019–20 2,55,587 383.38
(51 మండలాలు)
2022–21 2,68,076 402.11
(51 మండలాలు)
2021–22 1,87,742 281.61
(36 మండలాలు)
2022–23 1,80,203 270.30
(36 మండలాలు)
మొత్తం 8,91,608 1337.40

మరో నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ పలకరించనుంది. దాంతోపాటే

మరో నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ పలకరించనుంది. దాంతోపాటే