
రూ.3.20 లక్షలు చెల్లించమంటున్నారు
ఇంజనీరింగ్ ఫైనలియర్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో తమకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ట్రిపుల్ ఐటీ అధికారులను కోరగా.. రూ.3.20 లక్షలు చెల్లించమంటున్నారు. మాది వ్యవసాయ కుటుంబం.తల్లిదండ్రులు రమేష్, హైమావతి వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పోను మిగిలిన బకాయిలు చెల్లిస్తేనే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ట్రిపుల్ ఐటీకి చెల్లిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఖాతాలో జమ చేస్తామని చెబుతున్నారు. – ధరణి
(ఈసీఈ ఇంజనీరింగ్ ఫైనలియర్) చిత్తూరు జిల్లా, పుట్లూరు