
అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభా భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) లో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
● తాను పీఎం విశ్వకర్మ పథకం కింద చెప్పులు కుట్టడంలో శిక్షణ పొందానని, ట్రైనింగ్ ముగిశాక రూ. లక్ష రుణం మంజూరు చేస్తారంటూ అధికారులు చెప్పారని మైలవరం మండలం తలమంచిపట్నం గ్రామానికి చెందిన ఓరుగంటి పెద్దులయ్య అన్నారు. అధికారుల సూచన మేరకు తాను జమ్మలమడుగు ఏపీజీబీ అకౌంటులో రూ. 6 వేలు జమ చేశానన్నారు. అందులో మూడు వేలు రూపా యలు కట్ చేశారని తెలిపారు. రుణం గురించి అడగ్గా, పైనుంచి లిస్టు రాలేదని, ఆర్డర్ లేదంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. పైగా ఫీల్డ్ అఽధికారులు రఘుపతి, దీప హేళనగా మాట్లాడుతున్నారని తెలిపారు.
● చింతకొమ్మదిన్నె మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన కె. వెంకటలక్షుమ్మ తన ఇంటి ముందు ిసీసీ రోడ్డువేయాలని, అలాగే తన పొలం వద్ద విద్యుత్‌స్తంభం,ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వాలని కోరారు.
● కడప మండలం, మామిళ్లపల్లికి చెందిన ఉరవకొండ ప్రమీల రాణి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలులో అడ్మిషన్ సీట్ కోసం విన్నవించారు.
● కడప గాంధీనగర్ కు చెందిన ఎం. గంగాదేవి పులివెందుల టౌన్ లోని ఎస్టీ బాయ్స్ హాస్టల్‌ను నైట్ షెల్టర్ గా నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జడ్పి సీఈవో ఓబులమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు, ఎస్డీసీలు శ్రీనివాసులు, వెంకటపతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి