
నందబాలుని ఆనంద విహారం
ముగిసిన దేవునికడప తెప్పోత్సవాలు
కడప కల్చరల్ : దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ తెప్పోత్సవాలలో భాగంగా మూడవరోజు సోమవారం ముగింపు సందర్భంగా స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరించారు. ఆలయ అర్చకులు తొలుత ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు తిరుమంజన అభిషేకం నిర్వహించి అలంకారం చేశారు. అనంతరం పల్లకీపై స్వామికి సమీప వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి అలంకరించి పూజలు చేసి తెప్పపై కొలువుదీర్చారు. మూడుమార్లు వేద పండితుల మంత్రోచ్ఛాటనలు, రెండుసార్లు మంగళ వాయిద్యాల సుస్వరాలు, మరో రెండుసార్లు అన్నమాచార్య కీర్తనల మధ్య తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు బృందం పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

నందబాలుని ఆనంద విహారం