
అధికారులు చెప్పిన ఫీజులు చెల్లించలేం
ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు అధికారులు చెప్పిన ఫీజులను చెల్లించలేం. సెమిస్టర్–2 ఎగ్జామ్స్ పూర్తయి త్వరలో రిజల్ట్స్ వస్తాయి. మేము క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలకు ఎంపికై నందున త్వరలోనే సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులను కోరాం. కానీ ట్రిపుల్ ఐటీ అధికారులు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని అంటున్నారు. సర్టిఫికెట్లు లేనిదే ఉద్యోగాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఉద్యోగాలకు వెళ్లే అవకాశం ఉండదు.
– యండ్లూరు ఇందు
(ట్రిపుల్ ఐటీ విద్యార్థిని), సత్యసాయి జిల్లా, కదిరి