ఎర్ర స్మగ్లింగ్‌లో తగ్గేదేలే... | - | Sakshi
Sakshi News home page

ఎర్ర స్మగ్లింగ్‌లో తగ్గేదేలే...

May 12 2025 12:39 AM | Updated on May 12 2025 12:39 AM

ఎర్ర

ఎర్ర స్మగ్లింగ్‌లో తగ్గేదేలే...

రాజంపేట: ఉభయ వైఎస్సార్‌ జిల్లాలో విస్తరించిన సోమశిల బ్యాక్‌వాటర్‌ ‘పుష్పా’లకు అడ్డగా మారుతోందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. నందలూరు, ఒంటిమిట్ట మండలాల పరిధిలో ఉన్న సోమశిల బ్యాక్‌వాటర్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించి ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసింది. గతంలో ఉన్నతాధికారులు దుంగలను పట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.గత కొంతకాలంగా స్మగ్లింగ్‌ మళ్లీ పడగవిప్పిందని ముంపుగ్రామాల్లో చర్చ మొదలైంది. ఆదిశగా అటవీశాఖ చర్యలు కనిపించడంలేదన్న విమర్శలు ఉన్నాయి.

జనసంచారంలేని ప్రాంతాలే టార్గెట్‌..

అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికి వాటిని జనసంచారం లేని ముంపు గ్రామాల శివార్లకు చేర్చి.. అక్కడి నుంచి అనుమానం రాకుండా అనుకున్న ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ వ్యవహారం గురించి ముంపుగ్రామాల్లో ఏ ఒక్కరిని కదిలించినా చెప్పేస్తారు. ఇప్పటికే ఈ స్మగ్లింగ్‌తో బ్యాక్‌వాటర్‌ సమీప గ్రామాలకు చెందిన కొందరు ఆర్ధికంగా బాగా స్ధిరపడ్డారన్న వాదన వినిపిస్తోంది. పల్లాగట్టు, గుండ్లమడ ప్రాంతాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి వాటిని నాటుబోట్లలో గట్టుకు చేర్చి అక్రమంగా మెయిన్‌రోడ్డుకు తరలిస్తున్నారు.

చేపలవేట ముసుగులో...

చేపలవేట ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. ఐస్‌బాక్స్‌లో పైన చేపలు, కింద భాగంలో ఎర్రచందనం దుంగలు అక్రమంగా రవాణా చేస్తున్నారు. బ్యాక్‌వాటర్‌లో చేపల వేట ముసుగులో ముంపు గ్రామాలకు సంఽబంధించిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తుండగా ఇటీవల ఇతర ప్రాంతంలో పట్టుకొని కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేయడం వల్ల ముంపుగ్రామాలకు చెందిన కొందరు తిరుపతి, రేణిగుంట తదితర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లు, స్ధానికంగా కూడా విలాసవంతమైన జీవితాలను గుడుపుతున్నారని ఇక్కడి వారు చర్చించుకుంటున్నారు. ఈ విషయం అటవీశాఖ స్ధానిక సిబ్బందికి తెలియకుండా ఉంటుందా అన్న భావనలు పుట్టుకొస్తున్నాయి.

చెక్‌పోస్టులు ఉన్నా...

మచ్చుకొక సంఘటన..

సోమశిలలో పుష్పరాజ్‌లు

వెనుకజలాల చాటున యథేచ్ఛగా దుంగల అక్రమరవాణా

చేపల వేట ముసుగులో తరలింపు

స్థానిక అటవీ సిబ్బంది సహకారం పై అనుమానాలు

గత వారంలో కొంతమంది యువకులు బ్యాక్‌వాటర్‌లోకి వెళ్లారు. ఈత కొడుతుండగా దుంగలు కనిపించాయి.ఇది ఆ నోటా..ఈ నోటా అటవీఅధికారులకు చేరింది. బ్యాక్‌వాటర్‌లో తనిఖీ చేసేందుకు వచ్చారు. పరిశీలించి, అవి దుంగలు కాదు..రాళ్లు కొట్టుకువచ్చాయంటూ డైవర్సన్‌ చేశారు. అదే రోజున సిబ్బందికి నాటుకోడి, సారా విందు ఇచ్చారని ఆరోపణలు గుప్పుమన్నాయి. తర్వాత రెండురోజులకే బ్యాక్‌వాటర్‌లో ఉంచిన దుంగలను ఎవరికి అనుమానం రాకుండా తరలించేశారని ముంపుగ్రామాల్లో గుసగుసలు వినిపించాయి.

కడప–రేణిగుంట జాతీయరహదారిలో రామాపురం(రాజంపేట) భాకరాపేట(సిద్ధవటం)లో, రైల్వేకోడూరు –రేణిగుంట మధ్యలో బాలపల్లెలో, నెల్లూరు రహదారిలో బెస్తపల్లె, అనుంపల్లె వద్ద చెక్‌పోస్టులు ఉన్నాయి. అయినా ఏ విధంగా ఎర్రచందనం దుంగలు అక్రమంగా దాటిపోతున్నాయో అంతుపట్టడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సోమశిల బ్యాక్‌వాటర్‌ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచే యాలని ముంపువాసులు కోరుతున్నారు. నందలూరు మండలంలో మదనమోహనపురం క్రాస్‌ ద్ద అటవీ చెక్‌పోస్టు పెడితే ఎర్రచందనం అక్రమరవాణాకు బ్రేక్‌ పడుతందని మండలవాసులు పేర్కొంటున్నారు.

ఎర్ర స్మగ్లింగ్‌లో తగ్గేదేలే... 1
1/2

ఎర్ర స్మగ్లింగ్‌లో తగ్గేదేలే...

ఎర్ర స్మగ్లింగ్‌లో తగ్గేదేలే... 2
2/2

ఎర్ర స్మగ్లింగ్‌లో తగ్గేదేలే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement