
కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగం కుదేలైంది. పేదలకు వైద
కడప రూరల్: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్య రంగం ఎంతో కీలకమైంది. ఇప్పుడు ఈ రంగానికి చెదలు పట్టింది. ఫలితంగా వైద్య రంగానికి సంబంధించిన అన్ని సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో గ్రామీణుల వైద్యానికి సంబంధించి కీలకంగా ఉన్న ‘విలేజ్ హెల్త్ క్లినిక్’ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
● నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ కింద 2019 నుంచి ఎంఎల్‌పీహెచ్‌ల (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్) బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులతో నియామకాలను చేపట్టారు. ప్రస్తుతం వీరిని సీహెచ్‌ఓ (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)లుగా పిలుస్తున్నారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్‌సీ)ల పరిధిలో విధులను చేపడుతూ, స్థానికులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
● కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ వైద్యానికి గ్రహణం పట్టింది. సీహెచ్‌ఓలు తమ సమస్యలను పరిష్కరించాలని పాలకులకు విన్నవించారు. ఫలితం లేకపోవడంతో ఏప్రిల్ 28వ తేదీ నుంచి విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. సమ్మె బాట పట్టి రెండు వారాలు దాటినప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని సీహెచ్‌ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘సీహెచ్‌ఓ’ల పరిస్థితి దయనీయం
అద్దె భవనాల్లో కొనసాగుతున్న క్లినిక్‌లకు ప్రభుత్వం పది నెలలుగా బాడుగలు..కరెంట్ బిల్లులను చెల్లించలేదు. ఒక క్లినిక్‌కు ఒక నెలకు రూ 1000 నుంచి రూ. 4 వేల వరకు బాడుగ, కరెంట్ బిల్లు రూ 300 నుంచి రూ.450 వరకు ఉంటుంది. ఈ బిల్లులను సీహెచ్‌ఓలే చెల్లించడం గమనార్హం. అలాగే ప్రభుత్వం సమ్మెలో ఉన్న సీహెచ్‌ఓలపై బెదిరింపులకు పాల్పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సమ్మెలో ఉన్న సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనాలు మే నెలలో వేయలేదు. ఒకరికి ఒక నెల వేతనం రూ.25 వేల వరకు వస్తుంది. సమ్మెలో పాల్గొనని సిబ్బందికి దాదాపు 8–10 మందికి మాత్రమే 25 రోజులకు గాను రూ. 21 వేలు వేశారు. మిగతా వారికి ఒక్క పైసా కూడా జమ చేయకపోవడం గమనార్హం.
‘సీహెచ్‌ఓ’లకు నిబంధనల సంకెళ్లు
ఒక సీహెచ్‌ఓకు వేతనంతో సంబంధం లేకుండా సర్వీసు అంశాలకు సంబంధించి ఒక నెలకు ఇన్సెంటివ్ కింద రూ 15 వేలు అందుతుంది. ఈ ఇన్సెంటివ్ 9 నెలలుగా అందలేదు, తాజాగా ప్రభుత్వం 6 నెలల ఇన్సెంటివ్‌ను అందజేస్తామని ప్రకటించింది. ఆ ఇన్సెంటివ్‌ను ఎప్పుడు జమ చేసేది చెప్పలేదు. సీహెచ్‌ఓలు సమ్మెలో ఉండగా చెల్లిస్తారా..లేక సమ్మె విరమించిన తరువాత చెల్లిస్తారా అనే అంశంను తేల్చలేదు. ప్రభుత్వం 8వ తేదీన ఒక సర్కులర్ జారీ చేసింది. సీహెచ్‌ఓలు స్థ్ధానికంగా ఉండాలి. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు రాత్రి 8 గంటలకు ఎఫ్‌ఆర్‌సీ (అటెండెన్స్) వేయాలి. అలా చేయకపోతే ఇన్సెంటివ్‌లో రూ.5 వేలు కట్ చేస్తామని తెలపడం పట్ల సీహెచ్‌ఓలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ.15 వేలు ఇన్సెంటివ్ అనేది సర్వీసుకు సంబంధించిన అంశం. తమ సమస్యలను పరిష్కరించకపోగా ఈ కొత్త నిబంధనలు ఏమిటని సీహెచ్‌ఓలు ప్రశ్నిస్తున్నారు,
సమ్మెలో ‘సీహెచ్‌ఓ’లు..అందని వేతనం
ఇప్పటికే 9 నెలలుగా అందని ఇన్సెంటివ్
సంక్షోభంలో ‘విలేజ్ హెల్త్ క్లినిక్’లు

కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగం కుదేలైంది. పేదలకు వైద

కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగం కుదేలైంది. పేదలకు వైద