
మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడికి తీవ్ర గాయాల
మదనపల్లె రూరల్ : మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని గౌతమీ నగర్‌కు చెందిన సయ్యద్ సాబ్ వలి(30) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం స్థానికంగా పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అదుపుతప్పి మిద్దె పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.