
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి..
అధిక సంఖ్యలో ఉండే ఎస్‌జీటీ ఉపాధ్యాయులకై నా మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్–2 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులు బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించి అదనంగా పోస్టులను కేటాయించాలి. ప్రభుత్వం రూపొందించిన విధానాల వల్ల విద్యా రంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది.
– రెడ్డెప్పరెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్,
అధ్యక్షుడు అన్నమయ్య జిల్లా