కంపోస్టు యార్డులో అగ్ని ప్రమాదం
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని పొట్టిపాడు రోడ్డులో ఉన్న మున్సిపల్ కంపోస్టు యార్డులో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను కంపోస్టు యార్డులో నిల్వ ఉంచారు. సుమారు 20 ఎకరాల్లో కంపోస్టు యార్డు ఉంది. ఇందులో వివిధ రకాల వ్యర్థాలు నిల్వ చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో కంపోస్టు యార్డులోని సుమారు రెండు ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంటలు వ్యాపించకుండా సిబ్బందిచే చర్యలు తీసుకున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అర్థరాత్రి వరకు శ్రమించాల్సి వచ్చింది.
కంపోస్టు యార్డులో అగ్ని ప్రమాదం


