మైలవరం జలాశయానికి నీరు విడుదల
కొండాపురం: గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి నీటిని విడుదల చేసినట్లు జీఎన్‌ఎస్‌ఎస్ ఈఈ ఉమమహేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో సాగు, తాగునీటి అవసరాలకోసం గండికోట జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి మైలవరం జలాశయానికి నీటిని విడుదల చేశామన్నారు. గండికోట జలాశయంలో పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 22.5 టీఎంసీలు నిల్వ ఉన్నాయన్నారు.గండికోట ప్రాజెక్టు నుంచి గండికోట ఎత్తిపోతలపథకం ద్వారా మూడు మోటర్లతో 300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నామని వివరించారు.


