కడప సెవెన్‌రోడ్స్: ఈనెల 17వ తేదీ నుంచి మార్చి 31 తేదీ వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం అమరావతి నుంచి పదో తరగతి పరీక్షల సన్నద్ధత, కలెక్టర్ కాన్ఫరెన్స్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కావేటి విజయానంద్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.
● సీఎస్ వీసీ ముగిసిన అనంతరం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.సమస్యాత్మక పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరాలన్నా రు. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్‌లు ఉండేలా చూసుకోవాలని అధికారు ల ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌లు ఇతర జిల్లా అధికారులతో కలిసి (ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యం) పీ4 పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఓ హజరతయ్య, జిల్లా పంచాయతీరాజ్ అధికారిణి రాజ్యలక్ష్మి, డీఈఓ షంషుద్దీన్, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్ నాయక్,మెప్మా ిపీడీ కిరణ్ కుమార్, పోలీసు, రవాణాశాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
వివిధ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కావేటి విజయానంద్ సమీక్ష