ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవి.రామచంద్రారెడ్డి, పాఠశాల విద్య ఆర్‌జేడీ ఎద్దుల రాఘవరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని ఉమేష్‌చంద్ర పంక్షన్ హాల్‌లో కడప ఎంఈఓ పాలెం నారాయణ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ 35 ఏళ్ల ఉద్యోగ కాలంలో మచ్చలేని మనిషిగా కడప ఎంఈఓగా 8 ఏళ్లపాటు పాలెం నారాయణ పనిచేశారన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నేతలు, ప్రైవేటు స్కూల్స్ యాజమాన్య ప్రతినిధులు ఆయన సేవలను గుర్తు చేశారు. పాలెం నారాయణ మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయుడు నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి వరకు ప్రతి ఒక్కరూ తమకు సహకరించారన్నారు. అనంతరం పాలెం నారాయణ, ఆయన సతీమణి ఉమాదేవిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఆర్‌జేడీ, డీఈఓ, సమగ్రశిక్ష, మండల విద్యాశాఖ అధికార కార్యాలయాల సిబ్బంది, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పాఠశాల
విద్య ఆర్‌జేడీ ఎద్దుల రాఘవరెడ్డి


