
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
కడప కార్పొరేషన్ : జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులు అన్నారు. సోమవారం వారు గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ ఆధ్వర్యంలో వైకాపా కువైట్ కో కన్వీనర్ కళ్యాణ్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు షేక్ గఫార్, మైనారిటీ సభ్యులు షేక్ యాసిన్, కడప ఎన్‌ఆర్‌ఐ సభ్యులు షేక్ గయాజ్, బి.హెచ్. ఎజాస్, రాజంపేట వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్. గిరిధర్ తదితరులు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిశారు. బీహెచ్ ఇలియాస్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జగనన్న ప్రవాసాంధ్రులకు ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు. ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయన్నారు. గల్ఫ్ పోయే వారి కొరకు మెడికల్ సెంటర్ మన రాష్ట్రంలో లేదని, కడప, రేణిగుంట విమానాశ్రయాల్లో గల్ఫ్ విమానాలు దిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ విషయాలను జగనన్న దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గల్ఫ్ నుంచి వచ్చి పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
కార్యకర్తలకు అండగా ఉంటా : ఎంపీ
పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం భాకరాపురంలోని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్వగృహంలో పులివెందుల నియోజకవర్గం నుంచే కాక జిల్లా నలుమూలల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో వారివారి గ్రామాల్లో జరిగిన పోలింగ్ సరళిపై ఆరా తీశారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టబోతోందన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలకు సంక్షేమ పథకాలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సువర్ణపాలన అందించాన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని వారికి ఎళ్లవేళలా తాను అండగా ఉంటానని తెలిపారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిసిన
ప్రవాసాంధ్రులు