కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ యాజమాన్య పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆర్‌ఐవో రమణరాజు, డీవీఈఓ శ్రీనివాసులరెడ్డి, డీఈఓ ఎద్దుల రాఘవరెడ్డిలు సూచించారు. కడప మరియాపురం సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో పాఠశాల విద్య పరిధిలో ఇంటర్ వరకు నిర్వహించే స్కూల్స్‌కు సంబంధించిన ప్రిన్సిపాల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శుక్రవారం ‘యు డైస్ ప్లస్’ పైన ఒక్కరోజు వర్క్ షాపును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్ తమ కళాశాలల్లో విద్యార్థులతో పాటు మౌలిక వసతులకు సంబంధించిన సమగ్ర సమచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. కాగా, యూ డైస్ ప్లస్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేసే విధానాలపై డీఈఓ కార్యాలయ యు డైస్ ప్లస్ ఆర్గనైజర్స్ విశ్వనాథరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జ్వాలాపతిలు అవగాహన కల్పించారు.