
మాట్లాడుతున్న జేసీ సాయికాంత్‌వర్మ
జేసీ సాయికాంత్ వర్మ ఆదేశం
కడప సిటీ : ఒంటిమిట్టలో ఏప్రిల్ 5 న జరగనున్న సీతారాముల కల్యాణోత్సవ ఏర్పాట్లను అన్ని శాఖలు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై ఆయన ట్రైనీ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్వో గంగాధర్ గౌడ్ లతో కలిసి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఏప్రిల్ 5న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రముఖులు రానున్నందున అన్ని రకాల ఏర్పాట్లను ప్రణాళిక ప్రకారం చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, వెంకట రమణ, డ్వామా పీడీ యదుభూషణరెడ్డి, జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఆనందనాయక్, వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ప్రభాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్, ఆర్టీసీ, ఆర్టీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.