కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మత్స్య సంపద యోజన కేంద్రాన్ని లబ్ధిదారులు వినియోగించుకుని జీవనోపాధి పొందాలని కలెక్టర్ విజయ రామరాజు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో మత్స్య సంపద యోజన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ తో పాటు మత్స్యశాఖ డీడీ నాగలింగాచార్యులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2021–22 సంవత్సరానికి మినీ ఫిషరీస్ రిటైల్ అవుట్‌లెట్ల ఏర్పాటుకు 32 మంది ఎంపికయ్యారన్నారు. 14.20 లక్షల చేప పిల్లలను రిజర్వాయర్లలో స్టాక్ చేయడంతో మత్స్య సంపద వృద్ధి చెంది మత్స్యకారుల జీవనోపాధి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి, వ్యవసాయ జెడి నాగేశ్వరరావు, ఎల్‌డిఎం దుర్గాప్రసాద్, డిఆర్‌డిఎ పీడి ఆనంద్ నాయక్, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.