కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం శివానందపురానికి చెందిన కోడూరు హరి (36) అనే యువకుడు బుధవారం ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు కిందపడి మృతి చెండాడు. రైల్వే ఎస్‌ఐ రారాజు కథనం మేరకు...హరి ఎర్రగుంట్ల ఆర్టీపీపీ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం రైలులో వెళ్లి వచ్చేవాడు. మూడో ప్లాట్‌ఫాంపై సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఉంది. గూడ్స్ షెడ్ మార్గంలో గూడ్స్ రైలు ఉంది. రైలు వెళ్లిపోతుందేమోనని గూడ్స్ రైలు కింది నుంచి అవతలికి వెతుతుండగా అటువైపు నుంచి మరో గూడ్స్ రైలు వచ్చి ఢీకొనండంతో మృతి చెందాడు. మృతుడికి వివాహమై 40 రోజులైంది. ఇతని భార్య రిమ్స్ ఆస్పత్రిలో సాప్ట్ నర్సుగా పనిచేస్తోంది. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలియజేశారు.
గుర్తు తెలియని వివాహిత....
కడప నగర శివార్లలోని చౌటపల్లె సమీపంలో దిగువ రైలు పట్టాలపై గుర్తు తెలియని వివాహిత బుధవారం సాయంత్రం గూడ్స్ రైలు కింద పడి మృతి చెందిందని రైల్వే ఎస్‌ఐ రారాజు తెలిపారు. మృతురాలికి 25–30 మధ్య వయస్సు ఉంటందన్నారు.మెడలో తాళిబొట్టు, కాలికి మెట్టెలు ఉన్నాయని వివరించారు. ఈ మృతదేహానికి సంబంధించిన వారు 94406 46974 నంబర్‌లోగానీ కడప రైల్వే స్టేషన్‌లోని తమనుగానీ సంప్రదించాలని ఆయన సూచించారు.