
హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించి నట్లు ఆలయ సహాయ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి తెలిపారు.దేవదాయశాఖ తనిఖీదారు జనార్ధన్,ఆలయ చైర్మన్ పినుపోలు రాఘవేంద్ర ప్రసాద్‌ల పర్యవేక్షణలో ఈకార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఆలయంలోని హుండీల ద్వారా రు.20,99,142లు, అన్నదాన సత్రంలోని హుండీ ద్వారా రు.30,010లు ఆదాయం వచ్చిందన్నారు.అలాగే 085 మిల్లీ గ్రాముల బంగారం,537 గ్రాముల వెండి కూడా వచ్చిందన్నారు..కార్యక్రమంలో ఏపీజీబీ చక్రాయపేట బ్రాంచ్ మేనేజరు అశోక్,ఏఎస్సై నాగరాజు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.