
శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు
పులివెందుల రూరల్ : పట్టణంలోని వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు తొలిసారి అరుదైన శస్త్ర చికిత్సను చేశారు.వైద్యుల కథనం మేరకు వేముల మండలం వి.కొత్తపల్లె గ్రామానికి చెందిన చందా రామకృష్ణారెడ్డి భార్య అమ్మణ్నికి గర్భాశయం, అండాశయానికి మధ్యలో గడ్డ ఏర్పడింది. దీంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షలు జరిపి శస్త్రచికిత్స చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. బుధవారం ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెట్ డేవిడ్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో తొలిసారిగా ‘టోటల్ అబ్డామినల్ హిస్ట్రెక్టమీ’ ఆపరేషన్‌ను విజయవంతం చేసినందుకు వైద్యులను అభినందించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ హిమదేవి, గైనకాలజిస్ట్ లక్ష్మిప్రియ, ఉమాదేవి, వైద్యులు శాంతిశ్రీ, సుకన్య, నర్సు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.