యాదగిరీశుడి సన్నిధిలో నిత్యకల్యాణ వేడుక
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్యకల్యాణ వేడుక నిర్వహించారు. వేకువజామున శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలైన శ్రీస్వామి వారికి, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


