రేషన్‌కార్డులకు ఇ– కేవైసీ తప్పనిసరి
కార్డుదారులందరూ ఇ–కేవైసీ
చేయించుకోవాలి
భువనగిరి: నకిలీ రేషన్‌కార్డులను ఏరివేసేందుకుగాను కార్డుదారులతో ఇ– కేవైసీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి రెండేళ్ల కిత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొందరు ఈకేవైసీ చేయించుకున్నా.. ఇంకా కొంత మంది చేయించుకోవాల్సి ఉంది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా గురువారం అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి కలెక్టరేట్ నుంచి భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కేవైసీ పూర్తి చేయించడంపై సూచనలు చేశారు.
కొత్త సభ్యులు కూడా..
జిల్లాలో సుమారు 15వేల వరకు కొత్త రేషన్‌కార్డులు వచ్చాయి. వీటిలో సుమారు 25 వేలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. వీరంతా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. పాత కార్డుల్లో పేరు తొలగించుకుని వీటిలో చేరిన వారు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.
నకిలీ కార్డులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా..
ఈ కేవైసీ చేయించని వారికి గతంలో ప్రభుత్వం బియ్యం నిలిపివేస్తామని పలుమార్లు హెచ్చరించింది. అయినా ఇంకా కొంతమంది ఆలస్యం చేస్తున్నారు. ఇందుకు కారణం ఽఆధార్‌కు ఈకేవైసీ యంత్రానికి అనుసంధానం చేయడం వల్ల బినామి పేర్ల మీద బియ్యం తీసుకోకుండా అడ్డకట్ట వేయడం సులభం కానుంది.దీనితో రేషన్‌షాపులో బియ్యం పంపిణి మరిత సమర్థవంతంగా అమలు కానుంది.
జిల్లాలో 74 శాతం పూర్తి:
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 515 రేషన్ దుకాణాలు ఉండగా వీటి పరిధిలో 2,48,596 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 7,82,458 యూనిట్లు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా 4.957 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తారు. మొత్తం యూనిట్లలో ఇప్పటివరకు 5,82,005 యూనిట్లకు చెందిన వారు ఈకేవైసీ పూర్తి చేయించుకోగా 74.38 శాతం ఈకేవైసీ పూర్తయింది. ఈ నెల 31 నాటికి ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈకేవైసీ పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటివరకు 74 శాతం మాత్రమే ఈకేవీఐసీ పూర్తయింది. మిగతా కార్డుదారులు తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉంది.
– రోజా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
ఫ ఇప్పటివరకు జిల్లాలో
74 శాతం పూర్తి
ఫ ఈ నెలాఖరు వరకు అందరికీ
పూర్తి చేయించాలని ఆదేశాలు
ఫ తహసీల్దార్ కార్యాలయాల్లో
రేషన్‌డీలర్లకు అవగాహన కార్యక్రమాలు


