మెరుగైన వైద్యసేవలందించాలి
భువనగిరి: వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఎన్‌సీయూ, పీడియాట్రిక్, పోస్ట్ డెలివరీ, డెలివరీ విభాగాల సిబ్బంది పనితీరును పరిశీలించారు. డెలివరీ అయిన మహిళలతో మాట్లాడి టీకాలు వేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో కాంట్రాక్టర్‌పై, ఆస్పత్రిలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండునాయక్, వైద్యులు ఉన్నారు
82 మందికి షోకాజ్ నోటీసులు
కలెక్టర్ హనుమంతరావు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పలు విభాగాలు పరిశీలించారు. సమయపాలన పాటించని 63 మంది, విధులకు గైర్హాజరైన 19 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


