 
															పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తాం
నాగార్జునసాగర్: నీతి, నియమావళిని అవలంబిస్తూ పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో విధులు నిర్వహిస్తామని నాగార్జునసాగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు గురువారం ప్రతిజ్ఞ చేశారు. జెన్‌కో లోని విజిలెన్స్ విభాగం వారు ఈనెల 21న నిఘా అవగాహన (విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్) వారోత్సవాలు చేపట్టి నవంబర్ 2వ తేదీవరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగార్జునసాగర్‌లో సెంట్రల్ ఆఫీసులో ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. నైతిక వ్యాపార పద్ధతులను ప్రోత్సహిస్తామని, నిజాయితీ, సమగ్రత సంస్కృతిని పెంపొందిస్తామని, సమాజం యొక్క హక్కులు, ప్రయోజనాలను రక్షిస్తామని ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. కార్యక్రమంలో జెన్‌కో సీఈ మంగేశ్‌కుమార్ ఎస్‌ఈ, డీఈలు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
