 
															చికిత్స పొందుతున్న యువకుడు మృతి
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండల కేంద్రంలో ఈనెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా.. చికిత్స పొందుతున్న మరో యువకుడు గురువారం మృతిచెందాడు. అమ్మనబోలు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఇద్దరు యువకులు కొత్త చంద్రశేఖర్, దుర్గం రుషికేష్ ఈనెల 20న బైక్‌పై అమ్మనబోలు రోడ్డు నుంచి నార్కట్‌పల్లికి వస్త్తుండగా.. ప్రమాదవశాత్తు ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో వీరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రికి తరలించగా చంద్రశేఖర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స నిమిత్తం రుషికేష్‌ను హైదరాబాద్‌కు తరలించగా.. గురువారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రాంతి కుమార్ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
