 
															ప్రమాణస్వీకారం చట్టవిరుద్ధం
ఫ ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం
యాదగిరిగుట్ట రూరల్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం అజారుద్దీన్‌ను మంత్రిగా ప్రకటించి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేయడం చట్ట విరుద్ధమని, ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామానికి చెందిన ప్రజాస్వామ్య పరిరక్షణ కన్వీనర్ గుజ్జుల రాంచంద్రారెడ్డి గురువారం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికా రికి వినతి పత్రం అందజేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక వర్గాన్ని ప్రలోభ పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
