 
															ఆగని దుందుబి ఉధృతి
డిండి: మోంథా తుపాన్ కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి దిగువకు ప్రవహిస్తున్న దుందుబి వాగు ఉధృతి కొనసాగుతోంది. డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కుడి భాగంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న అలుగు గుండా నీటి ప్రవాహం అధికమవడంతో హైదరాబాద్–శ్రీశైలం వెళ్లే 765 హైవేపై నిర్మించిన బ్రిడ్జి బుధవారం అర్ధరాత్రి దెబ్బతిని కూలిపోయింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
