 
															సురేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
భువనగిరి: అసిస్టెంట్ లైన్‌మెన్ ఓర్సు నరేష్ మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గురువారం విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భువనగిరి విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు అనవసర ఒత్తిడిలు పెట్టడంతోనే విద్యుత్ కార్మికులు విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 అధ్యక్షుడు పడిగం యాదగిరి, కార్యదర్శి బొబ్బలి మురళి, విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు దొడ్డి యాదగిరి, రాజేష్, కుసంగి శ్రీనివాస్, బోట్ల రమేష్, జోగు వెంకటేశం, మీర్జా షకిల్ బేగ్, రమేష్‌రెడ్డి, సత్యనారాయణ, బాలనర్సింహ, లింగం, బాబురావు, రవీందర్, విజయకుమార్, స్వరూప, స్వప్న, విజయలక్ష్మి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
