
ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు
ఆలేరు: ఆలేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరింది. బునాది క్రమంగా కుంగిపోతోంది. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. స్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి. ఎప్పుడు కూ లుతుందో తెలియక విద్యార్థులు, అధ్యాపకులు క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నారు. ఇక వర్షాలకు లీకేజీలు ఏర్పడటంతో భవనం మరింత ప్రమాదకరంగా మారింది. శిథిల భవనంతో ముప్పు ఉందని, కళాశాలకు పనికిరాదని ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదిక ఇచ్చినా విద్యాశాఖ అధికారులు అలసత్వం వీడటం లేదు.
1993లో నిర్మాణం
జూనియర్ కళాశాల భవనాన్ని 1993లో తహసీల్దార్ కార్యాలయం పక్కన నిర్మించారు. దాదాపు 32 ఏళ్లుగా ఈ భవనంలో కళాశాల కొనసాగుతోంది. అయితే స్వల్పకాలానికే భవనం శిథిలావస్థకు చేరింది. భవనం నిర్మించి స్థలం ఫిట్‌గా లేకపోవడంతో భవనం స్ట్రక్చర్ మొత్తం బలహీన పడింది. తరగతి గదుల స్లాబ్‌లో ఇనుప చువ్వలు తేలాయి. లీకేజీలు, గోడలకు పగుళ్లు, నీటి చమ్మలతో శిథిలావస్థకు చేరింది. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు జూలై 21న ఆర్‌అండ్‌బీ ఈఈ బాలప్రసాద్ (ప్రస్తుతం బదిలీ అయ్యారు) కళాశాలను సందర్శించారు. భవనం, తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీ లించారు. తరగతుల నిర్వహణకు భవనం పనికిరాదని విద్యాశాఖకు నివేదిక ఇచ్చారు. నేల స్వభావం భవనంపై ప్రభావం పడి ఉండవచ్చని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత?
కళాశాల నిర్వహణకు భవనం పనికిరాదని ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదిక ఇచ్చినా మరో చోటకు తరలించకుండా ఇంటర్ విద్యాశాఖ చోద్యం చూస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారనే ఆలోచన అధికారులు చేయకపోవడం గమనార్హం
250 మంది విద్యార్థులు
కళాశాలలో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులతో పాటు కంప్యూటర్ సైన్స్, ఈటీ, డెయిరీ టెక్నాలజీ వృత్తివిద్య కోర్సులు బోధిస్తున్నారు. ఆలేరు, కొలనుపాక, రఘనాథపురం, దూదివెంకటాపురం, చిన్నకందుకూరు, శారాజీపేట, కొల్లూరు, ఇక్కుర్తి, అమ్మనబోలు, మంతపురి, శ్రీనివాసపురం,మోటకొండూరు తదితర గ్రామాలకు చెందిన 250 మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. అదే విధంగా బోధన, బోధనేతర సిబ్బంది 29మంది ఉన్నారు.
గోడలకు పగుళ్లొచ్చాయి
అన్ని తరగతి గదుల్లో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. లీకేజీలు ఉన్నాయి. వర్షం వస్తే గదులు కురుస్తాయి. అప్పుడప్పుడు పైకప్పు పెచ్చులూడిపడతాయి. ఇబ్బందులతోపాటు భయంతో గడుపుతున్నాం.
– జె. మణిధర్, విద్యార్థి, అమ్మనబోలు
భయంగా ఉంది
భవనం శిథిలమైంది. తరగతి గదుల గోడలు పెచ్చులూడుతున్నాయి. వర్షాలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. తరగతి గదిలో ఉన్నంత సేపు విద్యార్థులంతా భయపడుతున్నారు. – ఎం. రేఖ, విద్యార్థిని,
దూదివెంకటాపురం
శిథిలావస్థలో ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం
కుంగిన బునాది, గోడలకు పగుళ్లు, పెచ్చులూడుతున్న స్లాబ్
కాలేజీని సందర్శించిన
ఆర్‌అండ్‌బీ ఈఈ
తరగతుల నిర్వహణకు
పనికిరాదని విద్యాశాఖకు నివేదిక
ముప్పని తెలిసినా వీడని నిర్లక్ష్యం
కళాశాలను తరలించేందుకు ప్రతిపాదనలు
ఆర్‌అండ్‌బీ నివేదికను ఇంటర్ విద్యాశాఖ అధికారులకు అందజేశాం. తప్పని పరిస్థితుల్లో.. కాస్తా బాగున్న గదుల్లో తరగతులు కొనసాగిస్తున్నాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి జూనియర్ కాలేజీని తరలించే ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. – పూజారి వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్

ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు

ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు

ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు

ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు

ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు

ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు