
రూట్ మ్యాప్‌కు క్యూఆర్ కోడ్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రింగ్ రోడ్డులో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆలయ అధికారులు భక్తులకు ఆయా మార్గాలను, ఆధ్యాత్మిక వాడలోని లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, ప్రెసిడెన్షియల్ సూట్, తులసీ కాటేజీ, తదితర ప్రాంతాలను తెలుపుతూ క్యూఆర్ కోడ్‌తో కూడిన రూట్ మ్యాప్ ఫ్లెక్సీలను కొండ పైన, కొండ కింద వైకుంఠద్వారం వద్ద ఏర్పాటు చేశారు. భక్తులకు సులభతర ప్రయాణం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు ఈఓ వెంకట్రావ్ తెలిపారు.