పథకం ప్రకారమే వివాహిత హత్య..? | - | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే వివాహిత హత్య..?

Jul 2 2025 4:57 AM | Updated on Jul 2 2025 4:57 AM

పథకం ప్రకారమే వివాహిత హత్య..?

పథకం ప్రకారమే వివాహిత హత్య..?

గుర్రంపోడు: గుర్రంపోడు మండలం జూనూతుల గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు మహేష్‌ సోమవారం అదే గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచారం చేసి ఇంజెక్షన్‌ ద్వారా ఆమెకు గడ్డి మందు ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నప్పటికీ.. తనను వివాహిత బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నందునే ఆమెను పాశవికంగా హత్య చేశానని నిందితుడు చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ బలమైన కారణంతోనే నిందితుడు ఆమెను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి, నిందితుడి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాట్సాప్‌, ఫోన్‌కాల్‌ డేటాను సేకరిస్తున్నారు. చికిత్స పొందుతున్న సమయంలో మృతురాలు డాక్టర్‌కు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు గడ్డి మందు(ట్రైకాట్‌) డబ్బాను గుర్రంపోడు మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్‌ దుకాణం నుంచి పది రోజుల ముందే కొనుగోలు చేసి కారులో ఉంచుకుని పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గడ్డి మందు డబ్బాపై గల బ్యాచ్‌ నంబర్‌ను బట్టి గుర్రంపోడు మండల కేంద్రంలోనే గడ్డి మందు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి స్వగ్రామం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామం కాగా.. అతడు ఎనిమిదేళ్లు అక్కడే ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేశాడు. నిందితుడి తోడల్లుడు గుర్రంపోడు మండలం వట్టికోడు గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా స్థిరపడడంతో అతడి ద్వారా జూనూతల గ్రామంలో ఆర్‌ఎంపీ వైద్యుడు లేడని తెలుసుకుని ఇక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని భార్యాపిల్లలతో ఉంటున్నట్లు తెలిసింది.

అంతుచిక్కని నిందితుడి నైజం..

నిందితుడు మహేష్‌ జూనూతల గ్రామంలో ఎనిమిదేళ్లుగా ఉంటున్నా అతడు ముభావంగా ఉంటూ కనీసం ఇంటి పక్కన వాళ్లతోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని, అతడికి గ్రామంలో ఏ ఒక్కరితోనూ మిత్రుత్వం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే నిందితుడు గతంలోనూ తన బంధువుకు ఫోన్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపగా.. ఈ విషయంపై వారు రాజీపడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

ఫ నిందితుడి తీరుపై పలు అనుమానాలు

ఫ కొనసాగుతున్న విచారణ

ఫ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement