భరత్‌చంద్రచారి.. కంగ్రాట్స్‌ | - | Sakshi
Sakshi News home page

భరత్‌చంద్రచారి.. కంగ్రాట్స్‌

May 1 2025 1:48 AM | Updated on May 1 2025 1:48 AM

భరత్‌చంద్రచారి.. కంగ్రాట్స్‌

భరత్‌చంద్రచారి.. కంగ్రాట్స్‌

సంస్థాన్‌ నారాయణపురం : ‘భరత్‌చంద్రచారి కంగ్రాట్స్‌.. నేను జిల్లా కలెక్టర్‌ను మాట్లాడుతున్న.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. మొదటగా నీ ఫలితాలే చూశా.. మధ్యలో చదువు అపినప్పటికీ ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించావు.. 73 శాతం మార్కులు వచ్చాయి.. సెకండ్‌ లాంగ్వేజ్‌లో తక్కువగా వచ్చినా గణితంలో 86 మార్కులు సాధించావు.. ఒకటిరెండు రోజుల్లో మీ ఇంటికి వస్తా’ అని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు.పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో సంస్థాన్‌నారాయణపురం మండలం కంకణాలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దేశ్యతండాలో నివాసం ఉంటున్న దేవరకొండ భరత్‌ చంద్రచారికి బుధవారం కలెక్టర్‌ కాల్‌ చేసి అభినందించారు. పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌కు ప్రిపేర్‌ కావాలని సూచించారు. పాలిటెక్నిక్‌ చేస్తే ఇంజనీరింగ్‌ చేయొచ్చని, అది వద్దనుకుంటే ఐటీఐ చేయమని సలహా ఇచ్చారు. బాసర్‌ ట్రిపుల్‌ ఐటీలోనూ దరఖాస్తు చేయాలన్నారు. అనంతరం అతని తల్లి విజయలక్ష్మితో కలెక్టర్‌ మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు.

సర్‌. మీ ప్రోత్సాహం వల్లే..

కలెక్టర్‌ మాటలకు విద్యార్థి భరత్‌ చంద్రచారి ఆనందం వ్యక్తం చేశారు. మీ ప్రోత్సాహంతో చదవగలిగా సర్‌.. అని సమాధానం ఇచ్చారు.

విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమానికి భరత్‌ చంద్రచారి ఇంటినుంచే శ్రీకారం

టెన్త్‌లో 100శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కలెక్టర్‌ హనుమంతరావు విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని దేశ్యాతండాలో భరత్‌ చంద్రచారి ఇంటి నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఫ దేశ్యతండాలో దత్తత తీసుకున్న విద్యార్థికి కలెక్టర్‌ ఫోన్‌ కాల్‌

ఫ పదో తరగతిలో మంచి మార్కులు సాధించావంటూ కితాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement