యాదాద్రి ఆలయంలో మరో ఉద్యోగిపై వేటు

ఫ జూనియర్‌ అసిస్టెంట్‌ ఆగారెడ్డి సస్పెన్షన్‌

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరో ఉద్యోగిపై వేటు పడింది. జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆగారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఈఓ గీతారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఆగారెడ్డి ప్రస్తుతం లడ్డూల సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆగారెడ్డిని ఈఓ గీతారెడ్డి సస్పెండ్‌ చేశారని సంబంధిత లడ్డూల సెక్షన్‌ అధికారులు వెల్లడించారు.

Read latest Yadadri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top