
రాజాపేట : బీఆర్‌ఎస్ పార్టీతో ఉనికి కోల్పోతామని నరేంద్రమోదీ ప్రభుత్వం కేసీఆర్‌ను అణచివేసే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఇలాంటి నరేంద్రమోదీలు ఎందరు వచ్చినా కేసీఆర్‌ను ఏమీ చేయలేరని అన్నారు. మంగళవారం మండలంలోని రఘునాథపురంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండాపోయిందని, మాట్లాడితే కేసులు పెడుతున్న బీజేపీని బొందపెట్టాలని అన్నారు. ప్రశ్నించిన రాహులు గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామకమన్నారు. ఎమ్మెల్సీ కవితను రాజకీయ కుట్రతోనే ఈడీ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రోజుల తరబడి విచారణ పేరుతో కేసీఆర్‌ను, కవితను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ భారత దేశంలో ఇతర పార్టీ ఉండకుండా మోదీ ముందుకు సాగుతున్నాడని విమర్శించారు. కేసీఆర్‌ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టి రాజకీయంగా దెబ్బతీయ్యాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు. మహిళల అభ్యన్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మహిళలు నీళ్ల కోసం కొలాయి వద్ద ఇబ్బంది పడకుండా నేరుగా ఇంటివద్దకే గోదావరి నదీజలాలను అందిచారని, మహిళలకు 50శాతం రిజర్వేషన్లను అమలు చేశారని తెలిపారు. కేసీఆర్ పాలనలో పల్లెల ప్రగతి మారిందని, ప్రజల జీవన విధానం మెరుగు పడిందన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ పథకాలను ప్రతిగడపకు తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, జిల్లా ఇన్‌చార్జ్ కంచర్ల రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీపీ బాలమణి, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జ్ గొల్లపల్లి రాంరెడ్డి, యూత్ అధ్యక్షుడు పల్లె సంతోష్‌గౌడ్, స్వామి, ప్రవీణ్, గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ సునీత, మాజీ మంత్రి మోత్కుపల్లి