
ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అసోం రాష్ట్ర వ్యవసాయ అధికారులు
తుర్కపల్లి: అసోం రాష్ట్ర వ్యవసాయ అధికారులు మండలంలోని వాసాలమర్రి గ్రామంలో గల అరుణ్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌లో జరుగుతున్న ట్రైనింగ్‌లో భాగంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గానుగతో నూనె తయారీ విధానం, సేంద్రియ ఎరువులు, జీవామృతం, ఘన జీవామృతం తయారీని పరిశీలించారు. ఐదు దొంతర్ల పద్ధతి ద్వారా పండ్ల మొక్కల పెంపకం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసోం రాష్ట్ర ఏడీఓ పీపీ ఉపానంద పట్వారీ, బీటీఎం బర్నాలి దాస్, బోడాన్ లోహాన్, నూమల్ డీయోరీ బారాలీ, ఉదీప్త కున్వార్, రంజీత్ బోరా, సుక్యన గోగీ, దబ్‌జీత్ సేనాపతి, శ్యామాల్ బూరా, బీపీల్ కేర్‌నాథ్, జోయాగోస్వామి, ముత్యుజయ శిఖా, సంతోష్ గుహన్, మృణాల్ కాంత్, ధనుంజయ ముసారి, రాజు పుకాన్, పరంజీత్ భూయన్, జయంతా మదుహదత్, కమలేందర్ బ్రహ్మణ్ తదితరులు పాల్గొన్నారు.