
మాట్లాడుతున్న వీరయ్య
ఆలేరురూరల్ : కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న మోదీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య ఆరోపించారు. సోమవారం బస్సు జన చైతన్య యాత్ర ఆలేరుకు వచ్చిన సందర్భంగా మార్కెట్ కమిటీ నుంచి ఏఎన్‌ఆర్ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరయ్య మాట్లాడారు. దేశంలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వైపు ప్రజల మీద భారాలు మోపుతూ మరో వైపు కార్పొరేట్ సంస్థలకు కోట్ల రూపాయల రాయీతీలు అందిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. భువనగిరి జిల్లాలో మూసీ నదిని ప్రక్షాళన చేయాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు కోరుతున్నారని, జలశక్తి అభియాన్ పథకం కింద 10వేల కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆసయ్య, టి.స్కైలాబ్‌బాబు, బాలకృష్ణ, అడివయ్య, జగదీష్, జయలక్ష్మి, పాదయాత్ర ఇంచార్జ్ అనగంటి వెంకటేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, పట్టణ, మండల కార్యదిర్శి ఎంఎ ఎక్బాల్, దూపిటి బాలరాజు, సత్యరాజయ్య, బుగ్గ నవీన్, రమేష్, మల్లేష్, చెన్న రాజేష్ పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్. వీరయ్య