జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. భువనగిరిలో రూ.2కోట్లతో నిర్మించిన అధునాతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రూ.75 లక్షల నిధులతో నిర్మించనున్న వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము నిర్మాణానికి, రైతు సేవా కేంద్రం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ లైవ్లీ హుడ్ మిషన్‌లో రూ.52.85 లక్షల వ్యయంతో నిర్మించిన పట్టణ నిరాశ్రయుల వసతి భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ అయాచితం శ్రీధర్, ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అమరేందర్‌గౌడ్, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ అమరేందర్, డీసీపీ రాజేశ్‌చంద్ర, మున్సిపల్ చైర్మన్ ఏనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మల, జెడ్పీటీసీ సభ్యులు బీరు మల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ పరమేష్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.