
అదనపు కలెక్టర్‌కు అర్జీ అందజేస్తున్న ఆటో కార్మికులు
భువనగిరిటౌన్ : ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత విభాగాలకు పంపించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదులు రాగా వాటిలో అత్యధికంగా 41 రెవెన్యూకు సంబంధించినవి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.నాగేశ్వరాచారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆటో స్టాండ్‌కు స్థలం కేటాయించాలని వినతి
భువనగిరి బస్టాండ్‌లో లోకల్ ఆటోలకు స్టాండ్ కేటాయించాలని కోరుతూ ఆటో కార్మికులు అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రెండు దశాబ్దాలుగా ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు బస్టాండ్ వెనుక ఆటోలు నిలుపుతూ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నామని వివరించారు. ప్రస్తుతం అక్కడ ఆటోలు నిలుపవద్దని ఆర్టీసీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని, బస్టాండ్ ఆవరణలో స్థలం కేటాయించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, ఆటో యూనియన్ నాయకులు ఎడ్ల నరేష్, కొలిపాక బాలు, మర్రి శివ, నవీన్, వలీ, స్వామి, రాములు, రాజు, ఉపేందర్, సతీష, గణేష్, ఎల్లయ్య ఉన్నారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి